కొండ చిలువ మేకను మింగేసింది.. మింగిన చోటనే కదల్లేక..!

బుధవారం, 27 జులై 2016 (13:41 IST)
కొండ చిలువ పిల్లినో కుందేలునో.. కప్పనో మింగేసిందని వినివుంటాం. అయితే కర్ణాటకలోని శూలగిరి సమీపంలోని గ్రామం వద్ద 13 అడుగుల కొండ చిలువ మేకను మింగేసింది. అంతేగాకుండా మింగింది.. మేక కావడంతో గత రెండు రోజులుగా ఉన్న చోటనే ఉండటంతో వరదాపురం పిండెగానపల్లి స్థానికులు ఎగబడి చూస్తున్నారు. ఇంకా వరదాపురం సమీపంలోని పొలంలో కొండ చిలువ మేకను మింగింది. 
 
రెండు రోజులు తరువాత మేకను వెదుకుతూ వెళగా సోమవారం రాత్రి కంటబడింది. కొండ చిలువ కదలక ఉండడం వల్ల మేకను కొండచిలువే మింగియుంటుందని నిర్దారణకు వచ్చారు. ఈ విషయం ఆ ప్రాంతమంతా తెలియడంతో కొండ చిలువను చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు. మింగడం పెద్దజీవిని కావడంతో ఆ చోటు నుంచి కొండ చిలువచే కదల్లేకపోతుందని స్థానికులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి