ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

దేవీ

గురువారం, 8 మే 2025 (17:38 IST)
Sobhita, chaitu
ఇటీవలే టాలీవుడ్ లో నాగచైతన్య, శోభితా జంట ముగ్గురు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికి కారణం శోభితా చీరకట్టుకుని ఢిల్లీలో వేవ్స్ మీటింగ్ కు హాజరు కావడమే. అక్కడ తాను కట్టుకున్న చీరపై శ్రద్ధపెడుతూ కనిపించింది. దానికిలో బాలీవుడ్ లోని మీడియా ఆమె గర్భం దాల్చినట్లు వార్తలు ప్రచారం చేశారు. దీనిపై ఆమె టీమ్ కూడా క్లారిటీ ఇస్తూ, చైతు, శోభితాలు జంట తల్లి దండ్రులు కావడంలేదని వెల్లడిస్తోంది.
 
ఇంతవరకు ఎవరూ ఖండించకపోవడంతో నేటితో క్లారిటీ ఇచ్చినట్లయింది. మరోవైపు లావణ్య త్రిపాటి కూడా తల్లిని కాబోతుందని విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. వరుణ్ తేజ్ చాలా ఆనందంతో వున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు నాగచైతన్య విషయంలో ఇంకాస్త ఆలస్యం అయ్యేట్లు వుందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు