మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న చిన్న సాకుతో.. తల్లి, సోదరిపై కాల్పులు జరిపారు. దీంతో వారు స్పాట్లోనే చనిపోయారు. ఈ అత్యంత దారుణ ఘటన కర్ణాటక జరిగింది. మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్(19)గా పోలీసులు గుర్తించారు.