ఈ నేపథ్యంలో ఆమె యాంటీజెన్ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గానే తేలింది. ఆ పరీక్షల ధ్రువీకరణపత్రాల్ని తన ఇంటికి వచ్చి తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి ఆమెకు సూచించాడు. దీంతో సెప్టెంబర్ 3న ఆమె అతడి ఇంటికి వెళ్లగా సదరు వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, తర్వాతి రోజు వదిలిపెట్టినట్లు మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.