ఇటీవలికాలంలో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే ప్రయాణికులు భారీ మొత్తంలో అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ ఆయా విమానాశ్రయాల్లో పట్టుపడుతున్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు కేజీ బంగారాన్ని తీసుకొస్తూ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ విమానాశ్రయంలో జరిగింది. ఈ ప్రయాణికుడి కడపులో నుంచి ఏకంగా 1140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సింగపూర్ నుంచి కోళికోడ్‌కు వచ్చిన విమానశ్రయ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీలు చేశారు. ఈ తనికీల్లో మలప్పురం జిల్లా వరియంకోడ్‌కు చెందిన నౌఫల్ (36) అనే వ్యక్తి దుబాయ్ నుంచి కోళికోడ్‌కు వచ్చాడు. అతన్ని అనుమానించి ఎయిర్ పోర్టు అధికారులు నిశితంగా తనిఖీ చేయడమే కాకుండా, పొట్టను స్కాన్ చేశారు.
ఇందులో ఆయన కడుపులో 1.063 కేజీల బంగారాన్ని క్యాప్సూల్స్‌గా మార్చి అక్రమంగా తీసుకొచ్చాడు. కస్టమ్స్ అధికారుల సాధారణ తనిఖీల్లో ఈ విషయం వెల్లడికాలేదు. అయినప్పటికీ వారికి అనుమానం వచ్చి ఆ ప్రయాణికుడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి స్కాన్ చేయగా అసలు విషయం వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.