తనపై అత్యాచారానికి యత్నించిన నకిలీ బాబాకు ఎదురుతిరిగి అతని జననాంగాన్ని కోసేసిన యువతి చర్యను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఖండించారు. నకిలీ బాబా జననాంగం కోసే బదులు ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించాల్సిందని చెప్పుకొచ్చింది.
స్వామిజీ ముసుగులో ఆరేళ్లుగా గంగేశానంద తీర్థపాద (54) అలియాస్ హరిస్వామి అనే ఓ దొంగ స్వామి ఎనిమిదేళ్లుగా కేరళలోని తిరువనంతపురానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని (23)పై లైంగిక దాడి చేయగా, ఆ యువతి తిరగబడి బాబా జననాంగాన్ని కోసేసిన విషయం తెల్సిందే.
దీనిపై ఆయన స్పందిస్తూ అంతవేగంగా స్పందించి ఆమె చేసిన పనికి కొంత సంతోషపడవచ్చు. కానీ, చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకోవడం కంటే పోలీసులను ఆశ్రయిస్తే బాగుండేది అని వ్యాఖ్యానించారు. ఆమెపట్ల తనకు సానుభూతి ఉందన్న థరూర్ ఎంతోమందికి కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. న్యాయాన్ని గెలిపించే సమాజమే మనకు కావాలిగానీ, ఇలా ప్రతి ఒక్కరు ఆమె చేతులోని కత్తి ద్వారా న్యాయం పొందాలని అనుకోకూడదన్నారు.