లింగ మార్పిడి చేయించుకున్న ఓ ట్రాన్స్‌జెండర్ టీచర్‌కు పలు పాఠశాలలో ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయుల నుంచి లైంగిక వేధింపులు ఎదరయ్యాయి. లింగ మార్పిడి చేసుకున్న నీవు... పిల్లల్ని కనగలవా అంటూ ఓ ప్రిన్సిపాల్ ప్రశ్నించాడు. మరో ప్రిన్సిపాల్ అయితే... ఉద్యోగం కోసం ఈ పని చేశావా అంటూ నిందించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
కోల్‌కతాకు హీరాన్యమ్ డే (30) అనే ట్రాన్స్‌జెండర్‌కు అధ్యాపక వృత్తిలో పదేళ్ళ అనుభవం ఉంది. అయితే, గతయేడాదే సెక్స్ రీ-అసైన్‌మెంట్ శస్త్రచికిత్స(ఎస్‌ఆర్‌ఎస్) చేయించుకున్నారు. తర్వాత 'సుచిత్ర డే'గా మారారు. అయితే అప్పటి నుంచే ఆమెను సమస్యలు చుట్టుముట్టడం ప్రారంభించాయి. ఆంగ్లం, భూగోళ శాస్త్రాల్లో డబుల్ ఎంఏ చేసిన సుచిత్ర... ఇటీవల కోల్‌కతాలోని పలు స్కూళ్లలో జరిగిన ఇంటర్వూలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమెను బ్రెస్ట్, సెక్సువాలిటీ, పిల్లలు పుట్టే సామర్ధ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. దీనిపై సుచిత్ర మాట్లాడుతూ 'ఒక పురుష ప్రిన్సిపాల్ నన్ను సెక్స్ తరువాత పిల్లలను కనగలవా? అని అడిగారు. అలాగే మరో ప్రముఖ స్కూలు ప్రిన్సిపాల్ నన్ను నిందించారు. ఉద్యోగం కోసం గుర్తింపును మార్చుకున్నావని ఆరోపించారు. కోల్ కతాలోని పలు స్కూళ్ల ప్రిన్సిపాళ్లు నన్ను... బోధించాల్సిన సబ్జెక్టులకు బదులుగా జండర్‌కి సంబంధించిన ప్రశ్నలతో వేధించారు' అని చెప్పుకొచ్చారు.