గురువారం బెంగళూరులో అన్ని హంగులతో, సకల అస్త్రశస్త్రాలను అమర్చుకుని సంతృప్తికరంగా గగన విహారం చేసింది. భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఈ ఫైటర్ జెట్‌ను డిజైన్ చేసింది. తేజస్ ఎంకే 1ఏ యుద్ధ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది.