తనతో పాటు పనిచేసే ఉద్యోగి. అతని పుట్టినరోజు. అందరూ గిఫ్ట్ బ్యాక్స్‌లు ఇవ్వడం... శుభాకాంక్షలు చెప్పడం మామూలే అనుకుంది ఆ యువతి. తనకు ఇష్టమైన వ్యక్తి.. స్నేహితుడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. అధిక ధర కలిగిన మద్యం బాటిల్‌ను ఇవ్వాలనుకుంది. వైన్ షాపుకు వెళ్ళలేక ఇబ్బంది పడి ఆన్లైన్లో వెతుకుతూ మోసగాళ్ళ చేతిలో అడ్డంగా దొరికిపోయింది.
యువతిని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నారు. ఇలా చేయడంతో ఆమె అకౌంట్ నుంచి 30 వేలు వేరే అకౌంట్‌లోకి వెళ్ళిపోయాయి. ఆ తరువాత ఎక్కువ డబ్బులు వచ్చాయని నమ్మించి మళ్ళీ స్కాన్ చేయమన్నారు. ఇలా 2 లక్షల దాకా లాగేశారు. దీంతో యువతి మోసపోయామని తెలుసుకుని సైబర్ పోలీసులకు ఆశ్రయించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.