వెంటనే దాన్ని ఎలుగుబంటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు ఐదు గంటపాటు శ్రమించి ఎట్టకేలకు ఆ ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఈ ఘటనతో పన్నా జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముఖేష్ రాయ్ (50), అతని భార్య గుడియా (45 ) పన్నానగరం అటవీ ప్రాంతంలో ఉన్న ఖర్మాయి మాత ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. అప్పుడు గుడి దగ్గరగా ఉన్నప్పుడు ఆ దంపతులపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో దంపతులు మృతి చెందారు.