పరాయి స్త్రీతో ఉండటాన్ని చూసిందనీ... భార్యను చితకబాదిన డీజీపీ.. ఎక్కడ?

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (11:06 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు విచక్షణ మరచిపోయారు. కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా, ఆమెను కిందపడేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ ఐపీఎస్ అధికారి పైశాచికత్వమంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ విషయం కాస్త రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లడంతో అధికారిపై చర్యలు తీసుకుని, విధుల నుంచి తప్పించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీ (ప్రాసిక్యూషన్‌)గా పురుషోత్తం శర్మ పని చేస్తున్నారు. ఈయన భార్యపై దాడి చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. తన భార్యను కొట్టి, కింద పడేసి, ముఖంపై పిడిగుద్దులు గుద్దుతున్న దృశ్యాలు ఆ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ కావడంతో అది కాస్త వైరల్ అయింది. 
 
దీనిపై పురుషోత్తం శర్మ కుమారుడు స్పందిస్తూ, వివాహేతర సంబంధం పెట్టుకున్న తన తండ్రిని.. తన తల్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందని, ఆ ఉక్రోషంతోనే ఆమెపై దాడికి దిగారని చెప్పుకొచ్చాడు. తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు. 
 
అయితే, దీనిపై పురుషోత్తం శర్మ మరోలా స్పందించారు. తాను అంతగా హింసిస్తుంటే.. 32 ఏళ్లుగా ఆమె తనతో ఎలా కాపురం చేయగలిగిందో తన కుమారుడు చెప్పాలని డిమాండ్ చేశాడు. కాగా, ఈ ఘటనపై స్పందించిన సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. పురుషోత్తంశర్మను విధుల నుంచి తప్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు