ఆరుగురు పిల్లలు చూస్తుండగా భార్యను చంపేశాడు..

సోమవారం, 15 జూన్ 2020 (11:43 IST)
మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఆరుగురు పిల్లల కంటి ముందే భార్యను హతమార్చిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, భోపాల్ ప్రాంతానికి చెందిన కట్వాలియా గ్రామంలో ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నాడు.. 45 ఏళ్ల సూరజ్. తన భార్యపై అనుమానంతో సూరజ్ ఆమెను హింసించేవాడు. అలాగే శుక్రవారం కూడా భార్యపై చేజేసుకున్నాడు. 
 
సూరజ్ భార్య సోదరుడు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనూ సూరజ్ భార్యతో గొడవకు దిగాడు. కానీ శనివారం ఉదయం సూరజ్ భార్య మృతదేహం ఇంట్లో వుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సూరజ్ తన భార్యను హతమార్చినట్లు తేలింది. 
 
కన్నబిడ్డల కళ్ల ముందే సూరజ్ ఆమెను హతమార్చాడు. ఈ విషయాన్ని పిల్లలే పోలీసులు తెలియజేశారు. శనివారం రాత్రంతా తల్లి శవం వద్దనే కూర్చుని వున్నామని.. తండ్రే తల్లిని చంపేశాడని చెప్పారు. దీంతో సూరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు