భోపాల్‌లో దారుణం ... 55 యేళ్ల మహిళపై అత్యాచారం

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (13:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. 55 యేళ్ళ మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను కర్రలతో చితకబాదారు. ఈ దారుణం గత నెలె 31వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భింద్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే, మరో ప్రాంతంలో విద్యాభ్యాసం చేస్తున్న కుమార్తెను చూసేందుకు భర్త గత నెల 30వ తేదీన వెళ్లాడు. దీంతో ఆ మహిళ ఒక్కటే ఇంట్లో ఉంది. 
 
ఇదే అదునుగా భావించిన పొరిగింటి వ్యక్తులైన బ్రిజేందర్‌, సూరజ్‌లు.. ఆమెను బలవంతంగా తమ ఇంట్లోకి లాక్కొచ్చారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా కర్రలతో ఆమెను చితకబాదారు. 
 
ఈ క్రమంలో భర్త సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పి బోరున విలపించింది. అనంతరం ఇద్దరు దంపతులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిజేందర్‌, సూరజ్‌లు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు