వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు. వీరి పెద్ద కుమార్తెకు 16 ఏళ్లు. భర్త ప్రవర్తన నచ్చక అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురు కూతుర్లతో కలిసి ఇతను ఉండేవాడు.
భార్య దూరం కావడంతో తన కామవాంఛ తీర్చుకునేందుకు ఇతని దృష్టి పెద్దకుమార్తెపై పడింది. రోజూ రాత్రుళ్లు ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులో ఉండగా అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అకృత్యానికి పాల్పడుతూ దాన్ని వీడియో తీసి మిగిలిన ఇద్దరి పిల్లలకూ చూపిస్తూ వారినీ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో తండ్రిని చూస్తే రాక్షసుడిని చూసినట్టు కుమార్తెలు వణికిపోయేవారు.