కాగా, గత నెల 22వ తేదీన జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై వివిధ రకాల పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆమె ఆరోగ్య పరిస్థితిని బహిర్గతం చేయాలంటూ సామాజికవేత్త ట్రాఫిక్ రామస్వామి హైకోర్టులో ఓ పిల్‌ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పిటీషన్‌దారునిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు సీఎం జయలలితకు చికిత్స అందించేందుకు ఎయిమ్స్ నుంచి ముగ్గురు వైద్యుల బృందం చెన్నై వచ్చింది. అలాగే, లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు రిచర్డ్ బేలే మరోమారు గురువారం చెన్నైకు రానున్నారు. కాగా, ఎయిమ్స్ వైద్య బృందం అపోలో ఆస్పత్రిలో ఆమెకు చికిత్స ప్రారంభించింది. ఊపిరితిత్తులు, గుండె మత్తుమందు నిపుణులు జయలలితకు చికిత్స అందిస్తున్నారు. జయలలితకు పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాకే ఏదైనా విషయం చెప్పగలమని అపోలో ఆస్పత్రి ప్రకటించింది.