మహిళా ఎంపీని అలా చిత్రీకరిస్తారా? బీజేపీ వెబ్‌సైట్‌ అంత పనిచేసిందా?

గురువారం, 28 జనవరి 2021 (14:37 IST)
Raksha Khadse
బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌లో మహిళా ఎంపీని హోమోసెక్సువల్‌గా పేర్కొనడం పట్ల మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆక్షేపించారు. బీజేపీ వెబ్‌సైట్‌లో ఈ వివరాలున్న స్క్రీన్‌షాట్‌తో కూడిన ట్వీట్‌కు మంత్రి బదులిచ్చారు.

స్క్రీన్‌షాట్‌లో ఎంపీ రక్షా ఖడ్సే ఫోటో కింద హోమోసెక్సువల్‌ అని రాసి ఉంది. కాగా, రక్షా బీజేపీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే కోడలు. ఏక్‌నాథ్‌ ఖడ్సే గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీ నుంచి ఎన్సీపీలో చేరారు. 
 
మహారాష్ట్రలోని రవెర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ ఈ తప్పిదానికి బాధ్యులను గుర్తించి చర్యలు చేపట్టనిపక్షంలో మహారాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ విభాగం జోక్యం చేసుకుంటుదని మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. మహిళలను అగౌరవపరిచే ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు