నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు శుక్రవారం పర్యటించనున్నారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. ముగ్గురు మంత్రులు కలిసి ఒకేసారి జిల్లాకు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రతను కూడా భారీ స్థాయిలో కల్పించారు. 
 
శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరే మంత్రులు నేరుగా నల్గొండగు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ను తొలుత ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. 
 
పిమ్మట్ బీట్ మార్కెట్‌లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ యార్డ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్గొండ జైలు ఖాన వద్ద రైతు బజార్, బస్తీ దవాఖానలకు స్థల పరిశీలన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ జిల్లా అభివృద్దికి సంబంధించి మున్సిప్ అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించి హైదరాబాద్ నగరానికి తిరుగు పయనమవుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు