మహారాష్ట్రలోని వార్దాలో ఓ రెండేళ్ళ చిన్నారి మెడకు నాగుపాము ఒకటి చుట్టుకుంది. ఇది ఏకంగా రెండు గంటల పాటు అలాగే ఉన్నది. ఈ పామును పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి.. చెయ్యిపై కాటేసి పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్నేక్‌ను పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు యత్నించినా ఫలితం దక్కలేదు. అనంతరం బాలికను సేవాగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతోంది. చిన్నారి పేరు దివ్యానీ పద్మాకర్ గడ్కరీ. వార్దాలోని సేలు పట్టణం బోర్ఖేడీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ షాకింగ్ వీడియోను దిగువన చూడండి.