అయోధ్య రామ మందిర గర్భగుడికి చేరిన రామ్ లల్లా విగ్రహం

వరుణ్

గురువారం, 18 జనవరి 2024 (09:21 IST)
అయోధ్య రామ మందిర గర్భగుడి రామ్ లల్లా విగ్రహం చేరింది. గురువారం తెల్లవారుజామున క్రేన్ సాయంతో రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి ఆలయ నిర్మాణ కమిటీ గర్భగుడిలోకి భద్రంగా చేర్చారు. అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ప్రధాన విగ్రహం రామ్ లల్లా చేరింది. వేద మంత్రోచ్ఛారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చినట్టు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్మ తెలిపారు.
 
విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చి ఓ క్రేన్ సాయంతో గర్భగుడిలోకి చేర్చినట్టు వివరించారు. కాగా, విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్టించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏడు రోజుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 
 
ఈ నెల 21వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రాణప్రతిష్ట రోజున కూడా కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయని ట్రస్ట్ అధికారులు తెలిపారు. కాగా, రామాలయం ప్రాణప్రతిష్ట మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలోపు ముగియనుంది. అంతకుముందు బుధవారం ప్రధాన విగ్రహం ప్రతీకాత్మక ప్రతి రూపాన్ని ఆలయంలోకి తీసుకొస్తారు. కలశ పూజ నిరవహించారు. ప్రస్తుతం 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్టకు సంబంధించిన క్రతువును నిర్వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు