అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. హాజరు కానున్న రజనీకాంత్

సెల్వి

శనివారం, 6 జనవరి 2024 (10:04 IST)
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణం రామాలయ ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్య పట్టణంలో ఉన్న విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 
 
అయోధ్య ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయం హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇంకా జనవరి 22, 2024న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. రానున్న కొద్ది నెలల్లో నగరానికి ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. 
 
ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య లత, సోదరుడు సత్యనారాయణ కూడా వెళ్లనున్నారు. ఈ వేడుకకు హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్వాహకులు రజనీకాంత్‌కు ఆహ్వానం అందించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత 23వ తేదీన ఆయన తిరిగి చెన్నైకు చేరుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు