ఆర్మీ మేజర్ భార్య శైలజా ద్వివేదిని హతమార్చిన కేసులో అరెస్టయి, ప్రస్తుతం పోలీసుల కస్టడీలో వున్న ఆర్మీ మేజర్ నిఖిల్ రాయ్ హుండా.. విచారణలో పలు విషయాలు వెల్లడించాడు. మూడేళ్ల క్రితం తాను నాగాలాండ్ ఆర్మీ క్యాంప్‌లో పనిచేస్తుండగా.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా శైలజ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యిందన్నాడు. ఫేస్‌బుక్‌లో ఆమె అందం చూసి తనకు మతిపోయిందన్నాడు. ఆ అందమే తనను ఆకర్షించిందని.. ఆపై ఆమెతో స్నేహం చేశానని చెప్పుకొచ్చాడు.
కానీ శైలజ భర్తకు విడాకులు ఇవ్వమని కోరితే నిరాకరించింది. ఇంకా తనతో వివాహేతర సంబంధం కూడా వద్దనుకుందని.. ఆ కారణంతోనే హత్య చేశానని పోలీసుల విచారణలో నిఖిల్ హుండా వెల్లడించాడు. కాగా భర్త సహోద్యోగి, ఆర్మీ మేజర్ నిఖిల్ హండా చేతిలో శైలజ దారుణ హత్యకు గురైంది. ఇక శైలజ ద్వివేది 2017లో మిసెస్ ఇండియా ఎర్త్ పోటిల్లో అమృత్‌సర్ తరుపున పాల్గొంది.
గత సంవత్సరం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన గురించి, తన కుటుంబం గురించే కాక మన దేశంలో మహిళల భద్రత గురించి పలు విషయాలను వెల్లడించింది. తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అందమైన వ్యక్తినే తాను వివాహం చేసుకున్నానని చెప్పింది.