చనిపోతూ కూడా సహచరులకు దిశానిర్దేశం చేసిన మేజర్ ప్రఫుల్ (వీడియో వైరల్)

బుధవారం, 27 డిశెంబరు 2017 (14:23 IST)
ఇటీవల జమ్మూ-కాశ్మీరులోని కేరి సమీపంలో పాకిస్థాన్ సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా దారుణంగా కాల్పులు జరపగా, ఓ మేజర్, ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మేజర్ ప్రఫుల్ అంబాదాస్ మొహర్కర్‌ మరికొన్ని క్షణాల్లో చనిపోతానని తెలిసి కూడా సహచరులకు దిశానిర్దేశం చేస్తూ, కాల్పుల్లో గాయపడిన సహచరుల యోగక్షేమాలు అడుగుతూ, వారికి తక్షణం వైద్యం చేయించాలని ఆదేశిస్తూ ప్రాణాలు వదిలారు. 
 
అంతేకాకుండా, తనకు ప్రాణం ముఖ్యంకాదనీ, దేశ రక్షణ, సహచరుల యోగక్షేమాలే ముఖ్యమని తన చేతల ద్వారా మేజర్ ప్రఫుల్ నిరూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. ఆ వీడియోను ఓసారి తిలకించండి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు