ఉద్యోగాలను లాక్కునేందుకు, వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే ఈ జీఎస్టీని విధించారని మమత ధ్వజమెత్తారు. అలాగే ప్రభుత్వం అమలు చేసిన నోట్ల రద్దు అమానుషమని, అందుకు వ్యతిరేకంగా నవంబర్ 8న ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేయాలని మమత పిలుపునిచ్చారు. ఆ రోజున అందరూ తమ ట్విట్టర్ ఖాతాలో నలుపు రంగును ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొత్త పన్ను విధానం జీఎస్టీ ద్వారా లక్షల మంది చిన్న వ్యాపారులు రోడ్డున్న పడ్డారని ఆరోపించారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ డైరెక్ట్‌గా ఎదురుదాడికి దిగారు. గుజరాత్ ప్రజలకు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం కావాలని, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమీ ఇవ్వడం లేదన్నారు.