అయినప్పటికీ తండ్రి తీరు మారకపోవడంతో భార్య, పిల్లలతో కలసి అనిల్ గ్రామంలోనే వేరుగా ఉండసాగాడు. దీంతో వీణపై పగ పెంచుకున్న నాగరాజు కొడుకు లేని సమయంలో వీణను మరింత వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేని అనిల్... తన భార్యతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. ఫలితంగా జైలుకెళ్లిన నాగరాజు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు.
ఈ క్రమంలో ఆదివారం ఇంటి బయటకు వచ్చిన వీణపై తమ్ముడు మంజు సహకారంతో కత్తితో దాడి చేసిన నాగరాజు గొంతు, కడుపులో పొడిచాడు. వీణ కేకలు విన్న అనిల్, గ్రామస్థులు వెంటనే అక్కడికి వెళ్లగా అప్పటికే వీణ రక్తపుమడుగులో పడి ప్రాణాలు విడిచింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.