తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫతేబాద్ పట్టణానికి చెందిన రామ్‌దేవి (70), రామ్ అవతార్ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో కొడుకులకు దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో తనకు కుమారుడు పుట్టాడని, ఇపుడైనా ఇంటికి రావాలని నానమ్మ - తాతలను మనవడు విక్కీ ఆహ్వానించాడు. పైగా, తమకు కుమారుడు పుట్టిన ఆనందంలో పార్టీ జరుపుకుంటున్నామనీ, ఈ పార్టీకి వచ్చి ఆనందించాలని కోరాడు. అయితే, తాము తాము వచ్చే ప్రసక్తే లేదని నానమ్మ రామ్‌దేవి స్పష్టం చేసింది.
దీంతో కోపోద్రిక్తుడైన విక్కీ.. నానమ్మ రామ్‌దేవి ఇంటికి వచ్చి ఐరన్ రాడ్డుతో ఆమె తలను పగులగొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో రామ్ అవతార్ తన మనుమడు, కోడలు, కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.