ఇంటర్ విద్యార్థినిని నమ్మించి గర్భవతిని చేసిన పీజీ స్టూడెంట్

సోమవారం, 1 జూన్ 2020 (17:38 IST)
కపట ప్రేమను నటించి ఆడవారిని వలలో వేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యాచార ఘటనలు, నమ్మించి మోసం చేయడం వంటి వార్తలు రోజూ వస్తూనే ఉన్నాయి. బాలికను నమ్మించి గర్భం దాల్చేలా చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 
అరియలూరు జిల్లా కాత్తాన్‌కుడికాడు గ్రామానికి చెందిన పరమశివం అనే వ్యక్తి అరియలూరు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో పీజీ చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ప్లస్ టూ చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. అతడిని నమ్మిన ఆ బాలిక అతడితో శారీరకంగా కలిసింది. గర్భందాల్చింది.
 
శరీరంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. తల్లిదండ్రులు ఏమీ చేయలేక అబార్షన్ చేయించేందుకు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికే 5 నెలలు నిండి ఉండటంతో కుదరదని వైద్యులు చెప్పారు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు పరమశివంపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు