మహిళలు బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా వారిపై దాడులు అరాచకాలు మాత్రం తగ్గటంలేదు. ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒక చోట వారిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైస్కూల్లో చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి మరో ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
స్కూల్ కు వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాక పోవటంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. బాలిక బెంగళూరులో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు నగరానికి వచ్చి గాలింపు చేపట్టి నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.