సోషల్ మీడియాకు బానిస కాని అమ్మాయి కావాలి.. (video)

సోమవారం, 5 అక్టోబరు 2020 (16:37 IST)
అవును. ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవ్వరూ వుండట్లేదు. యువతకు ప్రత్యేకంగా సోషల్ మీడియా లేకపోతే ముద్ద దిగదు. ఇందులో యువతులు, యువకులపై సోషల్ మీడియా ప్రభావం బాగానే వుందని చెప్పాలి. 
 
సోషల్ మీడియా లేకుండా ప్రస్తుతం జీవనం గడిపేవారి సంఖ్య చాలామటుకు తక్కువేనని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి సోషల్ మీడియాకు బానిస కానటువంటి వధువు కోసం వెతుకుతున్నాను అనే ప్రకటన ఇచ్చాడు. ఇప్పటి వరకు మ్యాట్రిమోనీ లాంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ప్రొఫైల్‌లో చిరునామా, చదువు వంటి ఇతరత్రా వివరాలను పొందుపరచడం గమనించి వుంటారు. తాజాగా ఈ జాబితాలో సోషల్ మీడియా కూడా యాడ్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌, కమర్‌పుకుర్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన అమాట్రిమోనియల్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుత కాలంలో చేతిలో ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. మనుషుల మధ్య కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. 
 
అందుకే అతను ఈ విధంగా ప్రకటన ఇచ్చి ఉంటాడు. దీనిని ఐఏఎస్ అధికారి నితిన్ సాంగ్వాన్ ట్విటర్‌లో షేర్ చేశారు. 'పెళ్లి చేసుకోవడానికి ఇంతకుముందు ఉన్న కండీషన్లు మారాయి. కాబోయే వరుడు, వధువు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అనే క్యాప్షన్‌ను జోడించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు