వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనీ... కుమార్తెను చంపిన తండ్రి

మంగళవారం, 22 నవంబరు 2022 (11:55 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సూట్‌కేసులో కనిపించిన శవం కేసులోని మిస్టరీ వీడింది. కన్నతండ్రే కుమార్తెను తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపినట్టు తేలింది. తమ కులం కాకుండా వేరే కులం వ్యక్తిని ప్రేమించినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథురలోని యమున ఎక్స్‌ప్రెస్‌ రహదారి సమీపంలో ఒక ఎర్ర రంగులో ఉన్న లగేజీ ట్రాలీ సూట్ కేసు కనిపించింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ సూట్ కేసును విప్పి చూడగా, అందులో ఓ యువతి శవాన్ని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఈ విచారణలో ఆసక్తికర విషయం వెల్లడైంది. 
 
ఆ తర్వాత ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసారు. ఆయువతిని గుర్తించాంటూ ఢిల్లీ పోస్టర్లు అంటించారు. సోషల్ మీడియాను వినియోగించారు. కాగా, ఆదివారం ఉదయం పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో హత్యకు గురైన యువతిని 22 యేళ్ళ ఆయూషీ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె తల్లి సోదరుడికి ఫోటోలు పంపగా, వారు కూడా వచ్చి తమ కుమార్తేనని నిర్థారించారు. 
 
ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని బదర్ పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నితీశ్ యాదవ్ తన కుమర్తె మృతదేహాన్ని గుర్తించేందుకు మథురకు వచ్చారు. ఆయనను పోలీసులు విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించారు. కుటుంబానికి వ్యతిరేకంగా మరో కులం వ్యక్తిని కుమార్తె పెళ్లి చేసుకోవడం, రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి వస్తున్న ఆమె తీరు నచ్చక పోవడంతో ఆగ్రహం చేసినట్టు చెప్పారు. 
 
అప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తన లైసెన్సుడు సర్వీస్ గన్‌తో కాల్చినట్టు వెల్లడించారు. ఆ తర్వాత సూట్‌కేసులో పెట్టి యమునా ఎక్స్‌ప్రెస్ హైపై పడేసినట్టు చెప్పారు. కుటుంబానికి తెలియకుండా వేరే కులానికి చెందిన ఛత్రపాల్ అనే యువకుడిని ఆ యువతి పెళ్లి చేసుకుంది. అందుకే ఆమె చంపేశాడు. పైగా, ఈ కుమార్తె హత్యకు, మృతదేహాన్ని తరలింపునకు ఆమె తల్లి బ్రజ్‌బాలా కూడా సహకరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు