అపుడు రిషభ్ పంత్‌ ప్రాణాలు రక్షించి... ఇపుడు చావుతో పోరాటం చేస్తున్నాడు..

ఠాగూర్

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (11:01 IST)
గత 2022లో జరిగిన ఓ కారు ప్రమాదంలో చిక్కున్న భారత క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి ఇపుడు చావుతో పోరాటం చేస్తున్నాడు. అతని పేరు రజత్ కుమార్. 25 యేళ్లు. ఈయన తాజా తన ప్రియురాలు కశ్యప్‌తో కలిసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌ నగర్‌ జిల్లాలోని బుచ్చా బస్తీ అనే గ్రామంలో జరిగింది. 
 
తమ ప్రేమను వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రజత్ కుమార్ తన ప్రియురాలు కశ్యప్‌తో కలిసి విషం సేవించారు. ఈ ఘటనలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోయింది. రజత్ కుమార్ మాత్రం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
వీరిద్దరి కులాలు వేరు కావడంతో వారివారి కుటుంబాలు వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. పైగా, ఇతరులతో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. దీంతో వీరిద్దరూ మానసికంగా కుంగిపోయి, కలిసి ఒక్కటిగా చనిపోవాలని నిర్ణయించుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
 
ఇదిలావుంటే, 2022, డిసెంబరు నెలలో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు కారులో వెళుతూ ఆయన మెర్సిడెజ్ బెంజ్ కారు రూర్కీ సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టిు మంటల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలో ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్మన రజత్ కుమార్, నిషు కుమార్‌లు పంత్‌ను ప్రాణాలతో రక్షించారు. ఇక తన ప్రాణాలను రక్షించించి వారిద్దరికీ పంత్ తర్వాత ద్విచక్రవాహనాలను బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు