పిల్లలు పుట్టలేదని కోడల్ని పొట్టనబెట్టుకున్నారు.. హత్య చేసి కాల్చేయాలనుకున్నారు..

సెల్వి

బుధవారం, 17 సెప్టెంబరు 2025 (16:43 IST)
Woman
సంతానం కలగలేదని రాజస్థాన్‌లో ఓ కోడలిని చంపేశారు. పిల్లలు పుట్టలేదని కోడలిని హత్య చేశారు.. ఆమె అత్తమామలు. తర్వాత ఆమె మృతజదేహాన్ని కాల్చేశారు. కానీ ఇంతలో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. వివరాల్లోకి వెళితే.. 2005లో కాక్రా గ్రామానికి చెందిన అశోక్‌తో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. 
 
సరళ గర్భం దాల్చలేదని అశోక్ తరచుగా వేధించేవాడు. అత్తమామలు కూడా ఇదే విధంగా సరళను వేధించేవారు. విడాకులు ఇచ్చి అశోక్‌కు రెండో వివాహం చేయాలని సరళ అత్తమామలు భావించారు. కానీ సరళ విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది. అంతే ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్న సరళ అత్తమామలు ఆమెను హతమార్చి .. కాల్చేయాలనుకున్నారు. 
 
అగ్నిప్రమాదం జరిగిందని చిత్రీకరించాలని చూశారు. అయితే గ్రామస్తులకు అనుమానం వచ్చి దహన సంస్కారాలు చేపట్టే ముందు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, దహన సంస్కారాలు జరగకముందే పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని, సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తమామలపై హత్య కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు