భాస్కర్, మమత దంపతులకు చరణ్, తనుశ్రీ ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్‌కు నత్తి వుందనే కారణంతో మమత పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింట్లో ఉండగా మమతకు అదేగ్రామానికి చెందిన ఫయాజ్‌తో అక్రమసంబంధం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో ప్రియుడు ఫయాజ్‌తో కలిసి మమత వెళ్లిపోయింది.
విచారణలో కూతురు తనుశ్రీని తన వెంట తీసుకెళ్లిన మమత ఊరి చివర గొంతు పిసికి, గొయ్యి తీసి పాతిపెట్టినట్లు తేలింది. తనుశ్రీని తామే చంపినట్లు విచారణలో ఆ ఇద్దరూ అంగీకరించారు. దీంతో పోలీసులు ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.