ప్రముఖ పాప్ సింగర్ దుర్మరణం... ఎక్కడ.. ఎలా?

బుధవారం, 30 జనవరి 2019 (08:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా దుర్మరణం పాలయ్యారు. మధుర జన్‌పథ్ వద్ద యమున ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఈ సింగర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త నిఖిల్ భాటియా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. 
 
తన భర్తతో కలిసి ఆగ్రాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందకు శివానీ భాటియా దంపతులు కారులో బయలురేరారు. వారి కారు సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 89వ మైలురాయి వద్ద చేరుకోగానే, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనమెకటి ఢీకొంది. బీహార్‌కు చెందిన శివానీ దంపతులు ఢిల్లీలోని లాజ్‌పత్‌నగర్‌లో నివాసముంటున్నారు. స్థానికంగా పాప్ గాయనిగా ఆమె ఎంతో పేరు సంపాదించారు. ఆగ్రాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు