కర్ణాటక సంగీతంపై 'మీ టూ' దరువు ... ఏడుగురు కళాకారులపై నిషేధం

శుక్రవారం, 26 అక్టోబరు 2018 (10:48 IST)
'మీటూ' ఉద్యమం కర్ణాటక సంగీత కళాకారులకూ పాకింది. ఫలితంగా ఏడుగురు కళాకారులపై నిషేధం విధిస్తూ మ్యూజిక్ అకాడెమీ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతి యేడాది డిసెంబరు నెలలో చెన్నై నగరంలో ప్రతిష్టాత్మక మార్గశిరమాస సంగీతోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సంగీతోత్సవాల్లో వేలాది మంది కళాకారులు పాల్గొంటుంటారు. 
 
ఇందులో పాల్గొనే యువ గాయనీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో చిత్రవీణ కళాకారుడు ఎన్‌.రవికిరణ్‌ సహా ఏడుగురు ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారులు పాల్గొనకుండా మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ నిషేధం విధించింది. 'మీ టూ' ఉద్యమం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అకాడమీ అధ్యక్షుడు ఎన్‌.మురళి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
నిషేధం వేటు పడినవారిలో సంగీత కళానిధి బిరుదాంకితుడు చిత్రవీణ రవికిరణ్‌, ప్రముఖ గాత్ర కళాకారుడు ఓఎస్‌ త్యాగరాజన్‌, వయొలిన్‌ విద్వాంసుడు శ్రీరామ్‌, మృదంగ కళాకారులు మన్నార్గుడి ఎ.ఈశ్వరన్‌, శ్రీముష్ణం వి.రాజారావు, ఆర్‌.రమేశ్‌, తిరువారూరు వైద్యనాథన్‌లు ఉన్నట్టు ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు