రితిక టిర్కి అదిరే రికార్డ్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌ (video)

సెల్వి

శనివారం, 21 సెప్టెంబరు 2024 (13:03 IST)
Ritika Tirkey
సామాజిక మాధ్యమాల్లో 27 ఏళ్ల రితిక టిర్కి పేరు మారుమోగుతోంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేసిన టాటానగర్ - పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌గా మారారు. 
 
జార్ఖండ్‌లోని గిరిజిన సమాజానికి చెందిన 27 ఏళ్ల రితికా టర్కీ అనే యువతి టాటా నగర్- పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపిన తొలి గిరిజన లోకో పైలట్‌గా వార్తల్లో నిలిచింది. 
 
అంతకుముందు మహారాష్ట్రకు చెందిన సురేఖ యాదవ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన తొలి మహిళ లోకో పైలట్‌గా నిలిచారు. ఆసియాలోనూ ఈ రికార్డు ఈమెపైనే వుంది. 
 
సురేఖ యాదవ్ ఇటీవల సోలాపూర్ స్టేషన్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ వరకు సుమారు 450 కిలోమీటర్ల దూరం వందే భారత్ రైలు నడిపారు. ఆమె నడిపిన ఈ రైలు షెడ్యూల్ టైమ్ కంటే ఐదు నిమిషాల ముందుగా గమ్య స్థానాన్ని చేరుకోవడం విశేషం. 
 
తాజాగా సురేఖ బాటలో రితికా టిర్కీ సైతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన తొలి గిరిజన లోకో పైలట్‌గా రికార్డ్ సాధించడం విశేషం.

జార్ఖండ్‌లోని గిరిజన సమాజానికి చెందిన 27 ఏళ్ల రితికా టిర్కీ టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్‌గా వార్తల్లో నిలిచింది. ????????#VandeBharatExpress pic.twitter.com/DMZEC7QQOL

— Do Something For ????Better Society ✊ (@ChitraR09535143) September 20, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు