అపుడు హీరోయిన్.. ఇపుడు ఐఏఎస్ అధికారిణి.. మెహ్రీన్ మాజీ ప్రియుడికి నిశ్చితార్థం

సోమవారం, 8 మే 2023 (19:20 IST)
హీరోయిన్ మెహ్రీన్ మాజీ ప్రియుడు భవ్య బిష్ణోయ్‌ త్వరలోనే పెళ్ళిపీటలెక్కనున్నారు. ఆయన ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోనున్నారు. వీరి వివాహం త్వరలోనే జరుగనుంది. నిజానికి గత 2021 మార్చి నెలలో హీరోయిన్ మెహ్రీన్‌తో బిష్ణోయ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరూ ఎవరి పనుల్లో వారు పూర్తిగా నిమగ్నమైపోయారు. 
 
ఈ నేపథ్యంలో బిష్ణోయ్ గత 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇపుడు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. ఐఏఎస్ అధికారిణి పరి భిష్ణోయ్‌ను ఆయన మనువాడనున్నారు. వీరిద్దరికీ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు