17 యేళ్ళ యువతి 2014 జూలైలో ఆమె ఘజియాబాద్ యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలని, నటిగా రాణించాలని కలలు కంది. స్నేహితుడి ముసుగులో ఓ వ్యక్తి ఆమెకు సునీల్ కులకర్ణిని పరిచయం చేశాడు. తన సినీ పరిశ్రమలో చాలామందితో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి బాధిత మైనర్ బాలికను ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పి ఆ యువతిని తన వెంట తీసుకెళ్లాడు. అలా కొద్దిరోజులు ఢిల్లీలో, మరికొన్ని రోజులు ముంబైలలో ఉంటూ ఆమెను లైంగికంగా వాడుకున్నాడు.
ఈ క్రమంలో ఆమెతో శృంగారంలో ఉన్నపుడు పలు వీడియోలు, ఫోటోలు తీశాడు. వీటిని చూపి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుడా, మరికొందరి వద్దకు కూడా పంపించసాగాడు. చివరకు... బాధితురాలు ఢిల్లీ వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు బాధితురాలిపై అత్యాచారం జరిపిన మరో నిందితుడిని పట్టుకునేందుకు కోసం గాలిస్తున్నారు.