మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. ప్రతి రోజూ 50 వేల పైచిలుకు కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తోంది. అలాగే, నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. అనేక ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనలను కూడా చాలా కఠినంగా అమలుచేస్తున్నారు. అయినా కూడా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో.. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు సొంత రాష్ట్రాల దారి పడుతున్నారు. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారన్న భయంతో వారిలో నెలకొనడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.