మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్ దుర్మరణం

సోమవారం, 1 నవంబరు 2021 (18:34 IST)
మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్ దుర్మరణం పాలయ్యారు. అలాగే, మాజీ మిస్ కేరళ రన్నరప్ అంజనా షాజన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 31వ తేదీ అర్థరాత్రి కేరళలోని కొచ్చిన్ సమీపంలో జరిగిన రోడ్డు రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మృత్యువాతపడ్డారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. 
 
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పింది. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరగక కొన్ని నిమిషాల ముందు ఇంస్టాగ్రామ్‌లో 'అన్సి ఇట్స్ టైం టు గో' అంటూ ఓపోస్ట్ పెట్టారు. ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియాగా అన్సీ కబీర్ ఎంపికకాగా, కాగా 2019లో మిస్ కేరళగా రన్నరప్‌గా అంజనా షాజన్ నిలిచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు