అరేబియాలో కూలిన మిగ్ ఫ్లైట్ : పైలట్ మృతదేహం లభ్యం

సోమవారం, 7 డిశెంబరు 2020 (17:27 IST)
గత నెలలో అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయిన మిగ్ -29 విమానం ఆచూకీతో పాటు ఈ ప్రమాదంలో చనిపోయిన పైలట్ మృతదేహం ఆచూకీ తెలిసింది. నవంబరు 26వ తేదీన ఓ విమాన వాహక నౌక నుంచి నింగికెగిసిన ఈ మిగ్ పోరాట విమానం కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. తీరానికి కొద్దిదూరంలో సముద్రంలో కూలిపోయింది.
 
ఈ ఘటనలో ఓ పైలెట్‌ను సహాయ బృందాలు కాపాడగా, నిశాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యాడు. నిశాంత్ సింగ్ కోసం భారత నేవీ బృందాలు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. 
 
తాజాగా అతడి మృతదేహాన్ని గోవా తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. నీటి ఉపరితలానికి 70 మీటర్ల లోతు నుంచి నిశాంత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు