అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు డీఎంకే కోశాధికారి, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై అపోలో ఆస్పత్రికి శనివారం రాత్రి వచ్చారు. అయితే, ఆయనకు జయలలితను చూసే అవకాశం దక్కలేదు. సీనియర్ నేత దురైమురుగన్తో కలిసి ఆస్పత్రికి వచ్చిన స్టాలిన్ను మంత్రి ఓ పన్నీర్ సెల్వం, పళనిస్వామి, జయలలిత స్నేహితురాలు శశికళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత వద్దకు తీసుకెళ్లి చూపించారు.
జయలలితను చూసి బయటకు వచ్చిన ఎంకే.స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ... జయలలిత త్వరగా కోలుకోవాలని తమ పార్టీ అధినేత కరుణానిధితో పాటు.. తమ పార్టీ తరపున ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి ఆమె పూర్తిగా కోలుకోలేదని, పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టు వెల్లడించారు.
మరోవైపు.. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి ఎండీఎంకే అధినేత వైగో కూడా శనివారం వెళ్లారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, జయలలిత ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుందనే నమ్మకం తనకుందన్నారు. జయకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని... లక్షలాది ఏఐఏడీఎంకే కార్యకర్తల ఆందోళనలన్నీ త్వరలోనే మటుమాయమవుతాయని చెప్పారు. జయకు వైద్యం చేస్తున్న డాక్టర్లతో కూడా తాను మాట్లాడానని తెలిపారు. జయలలిత హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని తెలిసినప్పుడు తాను షాక్ కు గురయ్యానని చెప్పారు.