మరోవైపు ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా బాబాకు పోలీసులు పారిపోయేందుకు ఐడియా ఇచ్చారట. విషయాన్ని తెలుసుకున్న హర్యానా పోలీసు శాఖ ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, మరో కానిస్టేబుల్ కలసి గుర్మీత్ సింగ్ ఎలా పారిపోవచ్చుననే ప్లాన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురుని అరెస్టు చేసిన ఉన్నతాధికారులు వారి వద్ద విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.