Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

ఐవీఆర్

బుధవారం, 18 డిశెంబరు 2024 (21:03 IST)
Mumbai Boat Accident గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా వెళ్తున్న ప్రయాణీకుల పడవను నేవీ బోటు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 13 మంది మరణించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. పడవలో మొత్తం ఎంతమంది వున్నారన్నది ఇంకా నిర్థారణ కాలేదు. ఇప్పటివరకూ 101 మందిని రక్షించారు. గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోటు ప్రమాదం, ఆ తర్వాత ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. నేవీ స్పీడ్ బోటు ప్రయాణీకుల పడవను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
నీల్కమల్ అనే పడవ గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటాకు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. ఈ పడవ సామర్థ్యం 130 మంది ప్రయాణికులు. ప్రమాద సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఉరాన్‌లోని కరంజా ప్రాంతంలో పడవను నేవీ స్పీడ్ బోట్ ఢీకొట్టింది. స్పీడ్ బోట్ అధిక వేగంతో ప్రయాణీకుల పడవ చుట్టూ తిరిగింది. ఆ తర్వాత కొంత దూరం వెళ్లి చాలా వేగంగా జిగ్‌జాగ్ మలుపులో తిరిగి వచ్చి ప్రయాణికుల పడవను బలంగా ఢీకొట్టింది. ఐతే ఇలా ఎందుకు చేసారన్నది తెలియాల్సి వుంది.
 
ప్రమాదానికి గురైన నీల్‌కమల్‌ బోటులోని వారిని రక్షించేందుకు సీఐఎస్‌ఎఫ్ బోట్ షేరా 1 మొదట చేరుకుంది. ఈ బోటులో కేవలం ఇద్దరు జవాన్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణీకుల పడవ పగిలి మునిగిపోతుందని గుర్తించిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సహాయం కోసం ప్రయాణికులు కేకలు వేశారు.

ముంబైలో పడవ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు

గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా పడవ బోల్తా

ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు.. 50 మంది ప్రయాణికులను రక్షించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది pic.twitter.com/27w9AXH12N

— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు