ఆరు మిస్డ్ కాల్స్.. రూ.1.86 కోట్లను కాజేశాయి... ఎలా?

శనివారం, 5 జనవరి 2019 (11:18 IST)
ముంబైలోని ఓ వ్యాపారవేత్త బ్యాంక్ అకౌంట్ నుంచి ఆరు మిస్డ్ కాల్స్‌ ద్వారా రూ.1.86 కోట్ల నగదును గుంజేశారు. ఈ ఘటన వాణిజ్య రాజధాని ముంబైలో పెను సంచలనానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. సెట్రల్ ముంబై ప్రాంతానికి చెందిన బిజినెస్‌మేన్ మహీమ్. ఇతడు ఓ టెక్స్‌టైల్ వ్యాపారి. ఇతడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు.
 
ఆ ఫిర్యాదులో తన స్మార్ట్‌ఫోనుకు ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయని.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయిందని.. ఉదయం తన అకౌంట్ నుంచి రూ.1.86కోట్ల నగదును ఇతర బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయివుందని తెలిపాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ వంటి జిల్లాలకు చెందిన వారికి మహీమ్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ అయిన విషయాన్ని గుర్తించారు. 
 
14 బ్యాంక్ అకౌంట్లకు 28 సార్లు మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యిందని పోలీసులు తెలిపారు. టెక్నాలజీ పేరిట ఈ డబ్బును ఇతర అకౌంట్లకు పంపించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మహీమ్ అకౌంట్ నుంచి రూ.20లక్షలను మాత్రమే కాపాడగలిగామని.. మిగిలిన డబ్బు ఇతర అకౌంట్లకు వెళ్ళిపోయాయని పోలీసులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు