రైల్వే సిబ్బందికి 'మేక' కష్టాలు...

మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (17:14 IST)
రైల్వే సిబ్బందికి మేక కష్టాలు వీడటం లేదు. టికెట్‌ లేకుండా ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న మేకను రైల్వేస్టేషన్‌లో వదిలేసి పారిపోయాడు. అప్పటి నుంచి రైల్వే అధికారులకు మేక కష్టాలు ప్రారంభమయ్యాయి.
 
ముంబైలోని మజీద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లే మార్గం దగ్గర ఓ ప్రయాణికుడు టికెట్‌ లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడితో పాటు మేక కూడా ఉంది. రైల్వే టీసీ టికెట్‌ అడగటంతో సదరు ప్రయాణికుడు మేకను అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో చేసేదేమి లేక రైల్వే సిబ్బంది ఆ మేకను లగేజ్‌ పెట్టే గదికి తరలించారు. మేక తనదే అంటూ మేక యజమాని రైల్వే సిబ్బంది దగ్గరికి రాలేదు. 
 
దీంతో రైల్వే అధికారులు ఆ మేకను వేలానికి పెట్టారు. వేలం ధర రూ.3 వేలుగా రైల్వే అధికారులు నిర్ణయించారు. కానీ పాపం.. ఆ మేకను నిన్నటి వేలంలో కొనుగోలు చేసేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో వేలం కార్యక్రమాన్ని గురువారం కూడా చేపట్టారు. ఆ మేకను చూసుకున్న కేర్‌టేకర్స్‌ దానికి 'బసంతి' అని పేరు కూడా పెట్టారు. బసంతి ప్రవర్తన చాలా చక్కగా ఉందట. అంతేకాదు.. లగేజ్‌ గదిలో ఉంచితే ఎటువంటి ఇబ్బంది లేదట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు