గత జన్మలో నువ్వే నా భర్తవి అంటూ విద్యార్థినిని ఓ మహిళా ట్యూటర్ వేధించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన వెరోనికా బరోడే అనే వివాహిత ఓ ఇనిస్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేస్తోంది. ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆమెకు ఇండోర్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థినిని ఎక్కడో చూసినట్లుగా అనిపించి ఆ అమ్మాయితో మాట కలిపింది.
అయితే కొద్దిరోజుల నుంచి గత జన్మలో నువ్వే నా భర్తవి అంటూ.. ఈ జన్మలో కూడా నా భర్తగా నువ్వే వుండాలని.. మనం పెళ్లి చేసుకుని బంధాన్ని కొనసాగిద్దాం అంటూ అంటూ వేధించసాగింది. వెరోనికా వేధింపులకు విసిగిపోయిన విద్యార్థిని ఆమె ఫోన్ ఎత్తడం మానేసింది.. దీంతో ఉన్మాదిగా మారిపోయిన వెరోనికా.. ఇండోర్ వెళ్లి యువతి చదువుకునే కళాశాలకు వెళ్లి ఆరా తీసింది. విద్యార్థినిని కిడ్నాప్ చేయాలనుకుంది.