దివంగత సీఎం జయలలిత 2007 నుంచి టీటీవీ దినకరన్‌ను కలవలేదని మాజీ మంత్రి కేపీ మునుస్వామి తెలిపారు. దినకరన్ పాల్పడిన అవినీతితో రాజ్యసభ వెళ్లరాదని జయ ఆదేశించారని గుర్తుచేశారు. అనంతరం 2011 నుంచి పార్టీ నుంచి బహిష్కరించారని, 2007 నుంచి జయలలిత మరణించేంత వరకు దినకరన్ ఆమెను కలిసిన దాఖలాలు లేవన్నారు.
ఆస్పత్రిలో అమ్మ అదే రోజు తీవ్ర అస్వస్థతతో ఉందని ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరి అలాంటి స్థితిలో దినకరన్‌ను చూసి చేయి ఎలా ఊపిందో అర్థం కావడం లేదన్నారు. దినకరన్ చేస్తున్న అసత్యపు ప్రచారాలను అన్నాడీఎంకే కార్యకర్తలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఓ కుటుంబం చేతిలో పార్టీ చిక్కిన విషయం కార్యకర్తలందరూ అర్థం చేసుకున్నారని, వీరికి వారే గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అమ్మ ఆశయాలను పార్టీని కాపాడే వ్యక్తి ఓపీఎస్ అని చెప్పారు.