ఇస్లామిక్ ప్రకారం ఆహారాన్ని మూడు విధాలుగా పేర్కొంటారు. హలాల్, హరామ్, ముక్రూ అనే మూడు విభాగాల కింద ఆహారాన్ని చేర్చుతారు. ఇందులో మూడో విభాగంలో మరో రెండు విభాగాలున్నాయి. అవి ముక్రూ, ముక్రూ తహరీమ్. హలాల్ సమ్మతించిన ఆహారంగా, హరామ్ నిషేధించిన ఆహారంగా పేర్కొంటే ముక్రూ హేయమైన ఆహారంగా చెప్తారు. హేయమైన ఆహారాల్లో ముక్రూ తహరీమ్ అంటే తినకూడనది.