నేడు తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి రత్నభాండాగారం!!

వరుణ్

ఆదివారం, 14 జులై 2024 (11:23 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఆదివారం తెరువనున్నారు. ఈ మేరకు జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదు. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. 
 
ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? ఎవరు పాల్గొంటారు? భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా? తదితర వివరాలు వెల్లడి కాలేదు. భాండాగారం తలుపులు తెరవడానికి ఎంతమంది వెళ్తారన్న దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రక్రియంతా పూర్తి చేయడానికి మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఈసారి వివరాల నమోదును డిజిటలైజేషన్‌ చేయిస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు