నేపాల్, నాగాలాండ్‌లలో పెరుగుతున్న కరోనా కేసులు

గురువారం, 4 జూన్ 2020 (20:32 IST)
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నేపాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ నేపాల్ దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రం నాటికి అందిన నేపాల్‌లో కొత్తగా 334 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 2,634 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు నేపాల్ ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వల్ల ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు.
 
అలాగే రోజురోజుకూ నాగాలాండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గురువారం కొత్తగా మరో 22 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 80 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా సోకిన 22 మంది ఇటీవల చెన్నై నుంచి నాగాలాండ్ రాష్ట్రానికి తిరిగి వచ్చారని మంత్రి వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు